ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 27-09-2026 To 03-10-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Sep 27 2026 5:35 AM | Updated on Sep 27 2026 5:35 AM

Weekly Horoscope Telugu 27-09-2026 To 03-10-2026

మేషం...
కొన్ని సంఘటనలు బాగా ఆకట్టుకుంటాయి. సోదరులు, మిత్రుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. నేర్పు, ఓర్పుతో జఠిలమైన సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు.  నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం...
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు.  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మిథునం....
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. గతాన్ని విస్మరించి భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. వాహనయోగం కలుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులు పరిచయమై సహాయపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. . శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సమస్యలు కొన్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. బంధువుల నుంచి ధనప్రాప్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు విజయవంతం కాగలవు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. ఆకుపచ్చ, నీలం రంగులు.  దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

సింహం...
ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమైన పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటారు. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది, విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. . దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య...
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. గతంలో పొరపాట్లు సరిదిద్దుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వేడుకలకు ఆహ్వానిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. గులాబీ, తెలుపు రంగులు. . నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల....
ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది.  మీ వ్యూహాలు, ప్రణాళికలపై కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.  కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. వారం చివరిలో అనారోగ్యం. శ్రమ. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు.  శివపంచాక్షరి పఠించండి.

వృశ్చికం....
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ అభిప్రాయాలతో మిత్రులు ఏకీభవిస్తారు.  బంధువుల రాకతో సందడిగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు.  ఒక సమాచారంతో నిరుద్యోగులు ఊరట చెందుతారు. మీ నిర్ణయాలు అందరూ శిరసావహిస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు కొన్ని తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో  ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు.  దేవీస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు. విద్యార్థులకు శుభవార్తలు. నూతన వ్యక్తుల పరిచయం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో  మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం.  ఎరుపు, ఆకుపచ్చ రంగులు.  గణేశ్‌స్తోత్రాలు పఠిచంండి.

మకరం....
కొన్ని పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు. అయితే పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆత్మబలం, ధైర్యమే ఈవారం మీకు ఆయుధాలు. మిమ్మల్ని బలహీనపర్చడానికి ప్రత్యర్థులు చేసే యత్నాలు ఫలించవు. దూరపు బ«ంధువుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం...
ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విరోధాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రముఖులను కలిసేందుకు చేసేందుకు యత్నిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో ఎదురుచూడని మార్పులు సంభవం. కళారంగం వారికి ప్రోత్సాహం అంతగా కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం....
అనుకున్న పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో నెలకొన్న సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులతో  ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నమ్మిన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగుతారు. ఎవరు అడ్డగించినా లెక్కచేయరు. పూర్వపు సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో  ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు.  పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement