ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 28-09-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం

Sep 28 2026 3:04 AM | Updated on Sep 28 2026 3:04 AM

Rasi Phalalu: Daily Horoscope On 28-09-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,భాద్రపద మాసం, తిథి: బ.విదియ రా.8.04 వరకు తదుపరి తదియ, నక్షత్రం: రేవతి ప.11.57 వరకు తదుపరి అశ్వని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.14 నుండి 1.02 వరకు, తదుపరి ప.2.40 నుండి 3.26 వరకు, అమృత ఘడియలు: ఉ.9.35 నుండి 11.10 వరకు.

సూర్యోదయం : 5.53
సూర్యాస్తమయం : 5.50
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం.. పనుల్లో స్వల్ప ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. విద్యార్థుల. కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి..

వృషభం... కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. కళాకారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.

మిథునం..... ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.  విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం....శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. మిత్రులతో వివాదాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగానే కొనసాగుతాయి..

సింహం.... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపార, ఉధ్యోగాలలో కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు శ్రమాధిక్యం..

కన్య..... వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు  అనుకోని అవకాశాలు. యత్నకార్యసిద్ధి. అరుదైన పురస్కారాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.

తుల... దూరప్రాంతాల  నుంచి ఆహ్వానాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనయోగం.

వృశ్చికం.... కొత్తగా రుణాలు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో కొంత  ఒడిదుడుకులు. బంధువుల నుంచి మాటపడతారు. అనారోగ్య సూచనలు.

ధనుస్సు..... ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

మకరం... వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు. శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు..

కుంభం... ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. దైవదర్శనాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ధనవ్యయం.  వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. .

మీనం... విందువినోదాలు. పనుల్లో విజయం.  ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement