ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 01-10-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

Oct 1 2026 5:01 AM | Updated on Oct 1 2026 5:16 AM

Rasi Phalalu: Daily Horoscope On 01-10-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.పంచమి ప.2.44 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: కృత్తిక ఉ.9.06 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: రా.12.01 నుండి 1.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.44 వరకు, తదుపరి ప.2.45 నుండి 3.33 వరకు, అమృత ఘడియలు: ఉ.6.46 నుండి 8.17 వరకు.

సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం : 5.48
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం... పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. వ్యాపారాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు.

వృషభం... ఆర్థిక పరిస్థితి అనుకూలం. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మిథునం..... ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువర్గంతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు అనుకూలించవు.

కర్కాటకం.... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.  ప్రముఖులతో పరిచయాలు.

సింహం.... పాతమిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కాంట్రాక్టులు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

కన్య..... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు.

తుల.... కుటుంబంలో చికాకులు. దూరపు బంధువుల కలయిక. భాగస్వామ్య వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు. అనుకోని ప్రయాణాలు.

వృశ్చికం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

ధనుస్సు...నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొన్ని బాకీలు వసూలు. స్థిరాస్తి వృద్ధి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం... ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో చికాకులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. ఆర్థిక ఇబ్బందులు. ఆధ్యాత్మిక చింతన.

కుంభం... శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా.  సోదరులు, మిత్రులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం.... ముఖ్య కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రుల కలయిక. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement