గ్రహం అనుగ్రహం: శ్రీపరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.చవితి సా.4.45 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: భరణి ఉ.10.17 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.9.41 నుండి 11.10 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.27 నుండి 12.14 వరకు, అమృత ఘడియలు: లేవు.
సూర్యోదయం : 5.53
సూర్యాస్తమయం : 5.49
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ధనలబ్ధి. ప్రముఖుల పరిచయం. కళాకారులకు మంచి గుర్తింపు.
వృషభం... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సామాన్యమే. కళాకారులకు చికాకులు..
మిథునం.... ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. ఆస్తుల కొనుగోలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు.
కర్కాటకం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు.వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన.
సింహం..... ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. దైవదర్శనాలు. మిత్రులతో విభేదిస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కన్య..... రుణఒత్తిడులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం.
తుల.... ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి,వ్యాపారాలలో ఆశించిన ప్రగతి ఉంటుంది. ఆలయ దర్శనాలు. కళాకారుల యత్నాలు సఫలం.
వృశ్చికం... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు ఒత్తిడులు. దైవచింతన..
ధనుస్సు... పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన ఉద్యోగయోగం. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలత.
మకరం.... అనుకోని ధనవ్యయం. అదనపు బాధ్యతలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం. వాహనయోగం.
కుంభం.... నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతోసఖ్యత. నూతన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
మీనం... అనుకోని ధనవ్యయం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులు కొంత శ్రమపడాలి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.


