డీఎస్పీలతో వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టర్‌, ఎస్పీ రహస్య మంతనాలు | - | Sakshi
Sakshi News home page

డీఎస్పీలతో వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టర్‌, ఎస్పీ రహస్య మంతనాలు

Nov 29 2026 12:32 AM | Updated on Nov 29 2026 12:32 AM

వేంపల్లె : రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం వేంపల్లె కౌంటింగ్‌ కేంద్రాన్ని వైఎస్సార్‌ కడ జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలోని ఓ గదిలో పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు డీఎస్పీలు మురళి నాయక్‌, బాలస్వామిరెడ్డి, వెంకటేశ్వరరావులతో కలిసి కలెక్టర్‌, ఎస్పీ 15 నిమిషాల పాటు తలుపులు వేసుకుని రహస్య మంతనాలు జరిపారు. అనంతరం బందోబస్తుపై వివరాలు చెప్పాలని విలేకరులు జిల్లా ఎస్పీని కోరగా మీడియాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఎస్పీ నోటి నుంచి ఒక మాట కూడా రాకపోవడంతో పోలింగ్‌పై అపోహలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే ఆయన మీడియాతో మాట్లాడేందుకు విముఖత చూపారనే చర్చ జరుగుతోంది. అధికారుల తీరుతో ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదోనన్న సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. తర్వాత కలెక్టర్‌ స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి వెళ్లిపోయారు.

ఆంధ్ర జట్టు పైచేయి

● కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో పటిష్ట స్థితి

● మూడో రోజు ఆట ముగిసేసరికి 111 పరుగుల ఆధిక్యం

కడప వైఎస్‌ఆర్‌సర్కిల్‌: బీసీసీఐ అండర్‌–19 కూచ్‌ బెహర్‌ ట్రోఫీ ఎలైట్‌ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై ఆంధ్ర జట్టు పైచేయి సాధించింది. కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తన రెండో ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ప్రస్తుతం 111 పరుగుల ఆధిక్యంతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆదివారం ఆఖరి రోజు కావడంతో ఆంధ్ర విజయం కోసం దూకుడుగా ఆడుతుందా లేక మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

రాణించిన రాజేష్‌

ఓవర్‌నైట్‌ స్కోరు 224 పరుగులతో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన మధ్యప్రదేశ్‌ జట్టు 114.4 ఓవర్లలో 324 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో ఆర్యన్‌ కుష్వా (258 బంతుల్లో 92; 12 ఫోర్లు), మనల్‌ చౌహాన్‌ (77) అర్ధసెంచరీలతో రాణించారు. ఆంధ్ర బౌలర్లలో రాజేష్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకుని 5 వికెట్లు తీసుకున్నాడు. తోషిత్‌ యాదవ్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

దేవ్‌ ప్రమోద్‌ జోరు

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఆంధ్ర జట్టుకు బ్యాటర్లు అదిరే ఆరంభమిచ్చారు. దేవ్‌ ప్రమోద్‌ (88) సెంచరీ దిశగా సాగుతుండగా, సాయి నంద కిషోర్‌ (61) అర్ధసెంచరీతో రాణించాడు. ఓమి బస్వంత్‌ కృష్ణ (35) కీలక పరుగులు జతచేశాడు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో యష్‌వర్ధన్‌ చౌహాన్‌, యువరాజ్‌సింగ్‌ కన్‌షానా తలో వికెట్‌ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement