పోగొట్టుకున్న బంగారం గంటల్లో స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

పోగొట్టుకున్న బంగారం గంటల్లో స్వాధీనం

Nov 29 2026 12:32 AM | Updated on Nov 29 2026 12:32 AM

తిరుమల: అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన భక్తుడు జి.మహేష్‌ తిరుమలలో శుక్రవారం పోగొట్టుకున్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను తిరుమల కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది అత్యంత చాకచక్యంగా తిరిగి రికవరీ చేసి, ఆయనకు అందజేశారు.

కారు దిగే తొందరలో జారిన ఆభరణాలు

శుక్రవారం సాయంత్రం సుమారు 4:30 గంటలకు మహేష్‌ కారులో ప్రయాణిస్తూ, తిరుమల సీఆర్వో కార్యాలయం సమీపంలోని బస్‌స్టాప్‌ వద్ద అత్యవసరంగా దిగే సమయంలో తనవద్ద ఉన్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను పొరపాటున జారవిడుచుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఆభరణాలు పోయినట్లు గుర్తించి, వెంటనే తిరుమల కమాండ్‌ కంట్రోల్‌ను సంప్రదించారు.

సీసీటీవీ ఫుటేజ్‌తో వేగంగా గుర్తింపు

కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది వెంటనే సంబంధిత ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ఆ ఆభరణాలను తీసుకున్నట్లు గుర్తించారు. మొదటి వ్యక్తి తిరువణ్ణామలైకి చెందిన భక్తుడని గుర్తించారు. అతని లగేజీ వివరాలు సేకరించారు. ఆభరణాలు మరో భక్తునివని ఫోన్‌ ద్వారా తెలియజేసి, అతడిని తిరువణ్ణామలై నుంచి తిరుమలకు రప్పించారు. అతని వద్ద ఉన్న రెండు బంగారు గొలుసులు, ఒక బంగారు బ్రాస్‌లెట్‌ (మొత్తం సుమారు 52 గ్రాములు) శనివారం ఉదయం 4:30 గంటలకు స్వాధీనం చేసుకున్నారు.

రెండో వ్యక్తి నుంచి 8 గ్రాముల రికవరీ

రెండో వ్యక్తి ఉచిత దర్శనానికి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ అతను నారాయణగిరి షెడ్‌ నంబర్‌–7లో ఉన్నట్లు తెలుసుకుని అతని వద్ద ఉన్న సుమారు 8 గ్రాముల బంగారు ఉంగరాన్ని శనివారం ఉదయం 5:30 గంటలకు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భక్తుడు మహేష్‌కు అప్పగించారు. టీటీడీ సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ ఆదేశాలమేరకు భక్తుడు పొగొట్టుకున్న బంగారు నగలను తిరిగి అప్పగించేందుకు కృషిచేసిన టీటీడీ వీజీవో సురేంద్ర, ఏవీఎస్వో వెంకటరమణ, ఇతర అధికారులు, కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బందిని అభినందించారు.

తిరుమలలో 60 గ్రాముల పసిడి ఆభరణాలు జారవిడుచుకున్న భక్తుడు

సీసీటీవీ పర్యవేక్షణతో రికవరీ..

భక్తునికి అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement