అక్రమ మైనింగ్‌, పన్నుల ఎగవేతపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌, పన్నుల ఎగవేతపై కఠిన చర్యలు

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

పుంగనూరులో 20న మెగా జాబ్‌ మేళా

మదనపల్లె (కురబలకోట): 2026–27 ఆర్థిక సంవత్సరపు ఆదాయ వసూళ్ల లక్ష్యాలను సాధించేందుకు శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ, వాహన పన్నులు, మున్సిపల్‌, పంచాయతీ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సరిహద్దుల్లో నిఘా పెంచి అక్రమ మద్యం, అక్రమ మైనింగ్‌ మరియు పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

22న జిల్లా త్రోబాల్‌ జట్టు ఎంపిక

రామసముద్రం: మండలంలోని దిన్నిపల్లి సమీపంలో ఉన్న మోడల్‌ స్కూల్‌లో ఈ నెల 22న ఉమ్మడి చిత్తూరు జిల్లా త్రోబాల్‌ మెన్‌, ఉమెన్‌ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా త్రోబాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జెన్‌ కిరణ్‌, ఆర్గనైజర్‌ కిరణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసక్తి గల క్రీడాకారులు ఆరోజు ఉదయం 10 గంటలకు మోడల్‌ స్కూల్‌లో హాజరుకావాలని కోరారు. ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన వారు ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

మదనపల్లె (కురబలకోట): ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఈ నెల 20న ఉదయం 9.30 గంటలకు పుంగనూరు ఎంసీవీ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్‌. శ్యామ్‌ మోహన్‌ తెలిపారు. 12 కంపెనీలు పాల్గొని 485 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయన్నారు. 10వ తరగతి నుండి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హత గల 18–40 ఏళ్ల యువత అర్హులని (వేతనం రూ.12 వేల–రూ.35 వేలు), వివరాలకు 7780599208, 9618665579 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ఎన్నికల నిర్వహణపై శిక్షణ

పీలేరు : గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెడ్పీ సీఈవో లక్ష్మీపతి ఆధ్వర్యంలో స్టేజ్‌1, స్టేజ్‌ 2 అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియపై సమగ్ర అవగాహన అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో విజయలక్ష్మీ, డీపీవో రాధమ్మ, డీఎల్‌డీవో వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement