బి.కొత్తకోట: బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థిగా పాగొండ ఖలీల్ మదనపల్లె కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున కుడుం శ్రీనివాసులు చైర్మన్ అభ్యర్థిగా బి.కొత్తకోటలో నామినేషన్ సమర్పించారు. నగర పంచాయతీలో 23 వార్డులు ఉండగా వాటికి పోటీ చేసేందుకు 171 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో వైఎస్ఆర్సీపీ 79, బీజేపీ రెండు, బీఎస్పీ 4, సీపీఐ 9, కాంగ్రెస్ పార్టీ రెండు, టీడీపీ 48, జనసేన 14, స్వతంత్రులు 13 నామినేషన్లు వేశారు. చైర్మన్ పదవికి 32 మంది నామినేషన్లు వేయగా, వారిలో వైఎస్ఆర్సీపీ ఏడు, సీపీఐ 2, కాంగ్రెస్ పార్టీ మూడు, టీడీపీ ఏడు, జనసేన నాలుగు, ఇతర పార్టీలు ఒకటి, స్వతంత్రులు 8 మంది నామినేషన్లు వేశారు.
23 వార్డులకు 171, చైర్మన్ పదవికి
32 నామినేషన్లు


