పంచాయతీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

కలికిరి: పంచాయతీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌ రెడ్డి సూచించారు. కలికిరి మండలానికి చెందిన పలువురు నాయకులు సోమవారం తిరుపతిలోని ఎంపీ స్వగృహంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో వైఎస్సార్‌సీపీ మద్దుతుదారులు గెలిచే విధంగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలన్నారు. పార్టీ గెలుపుకోసం కష్టపడి పని చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రాహుల్‌ చక్రవర్తి రెడ్డి, మైనార్టి సంయుక్త కార్యదర్శి మాసూం రఫీ, నాయకులు రత్నశేఖర్‌రెడ్డి, మురళీరెడ్డి, ఎంఐ హనీఫ్‌, కేఎంఆర్‌ బావాజాన్‌, యుగంధర్‌, శామ్యూల్‌, శ్రీనివాసులురెడ్డి, లుక్మన్‌, తదితరులు ఎంపీని కలిసిన వారిలో వున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement