రాయచోటి టౌన్ : రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రాయచోటి అర్బన సీఐ బీవీ చలపతి తెలిపారు. రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి ఐదు రోజుల క్రితం ఎలాంటి ఆధారాలు లేకుండా కనీసం పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో అపస్మారక స్థితిలో వచ్చినట్లు ఆస్పత్రి వర్గాల వారు తెలిపారు. దీంతో ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్య సేవలు అందించారు. అయితే శుక్రవారం ఆయన మృతి చెందడంతో ఆస్పత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఆయన పేరు కానీ, ఏ ఊరు అనే వివరాలు చెప్పకపోవడంతో ఆయన ఎవరో గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించి, అనాథగా భావించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఆయనను గుర్తించి ఆనవాళ్లు తెలిపినా, కనీసం వివరాలు తెలిపినా వారికి సమాచారం చేరవేస్తామని పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9121100559కు ఫోన్ చేయవల్సిందిగా కోరారు.


