మహిళ అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యం

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

పెద్దతిప్పసముద్రం : అత్తారింట్లో ఉన్న తమ కుమార్తె సుప్రియ ఆరు రోజుల నుంచి కనిపించడం లేదని ఆమె తల్లి రత్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ పరమేశ్‌ నాయక్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం రాయల్‌పాడ్‌ మండలం గుడిసివారిపల్లికి చెందిన సుప్రియకు మండలంలోని రాపూరివాండ్లపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డితో వివాహం అయింది. గతంలో కూడా దంపతులు గొడవ పడగా పెద్ద మనుషులు రాజీ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 7 నుంచి తన కుమార్తె అదృశ్యం అయిందని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శుక్రవారం వెల్లడించారు.

ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌, ఎస్పీ

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్‌ను శుక్రవారం కడపలోని జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ కునుబిలి కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించడంతో వారు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు ప్రధాన జిల్లా న్యాయమూర్తికి మొక్కను అందజేసి స్వాగతం పలికారు.

ప్రొద్దుటూరులో చోరీ

ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని మోడంపల్లెలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాకలివీధికి చెందిన చౌడం రాజారాం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి రూ.5 లక్షలు పైగా నగదును అపహరించుకెళ్లారు. టూ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజారాం కుటుంబ సభ్యులు విజయవాడకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి కాబోర్డు,బీరువాలో భద్రపరిచిన రూ. 5 లక్షలు నగదును ఎత్తుకెళ్లారు. దొంగలు ఈ నెల 7,8 తేదీల్లో రాత్రి సమయంలో ఇంట్లోని డబ్బును దోచుకెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విజయవాడ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు తమ ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు రాజారాం టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వంశీనాధ్‌ తెలిపారు.

బాలికతో అసభ్య ప్రవర్తన

● వ్యక్తికి దేహశుద్ధి

బద్వేలు అర్బన్‌ : స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఓ ఎనిమిదేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని బాలిక కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి కడపకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. ఈ సమయంలో వారి కుమార్తె సమీపంలోని దుకాణం వద్దకు వెళ్లగా.. అక్కడే ఉన్న రామాంజనేయనగర్‌కు చెందిన ఓ వ్యక్తి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఏడుస్తూ పోయి తల్లిదండ్రులకు చెప్పడంతో వారితోపాటు ఇతర ప్రయాణికులు సదరు వ్యక్తికి దేహశుద్ధి చేసి అర్బన్‌ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో సదరు వ్యక్తిని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement