లారీ ఢీకొని బొలెరో డ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని బొలెరో డ్రైవర్‌ దుర్మరణం

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

● మృతుడు పాండిచ్చేరి వాసిగా గుర్తింపు

మదనపల్లె టౌన్‌ : మినీ లారీ ఢీకొనడంతో బొలెరో డ్రైవర్‌ దుర్మరణం చెందిన విషాదకర ఘటన శుక్రవారం ఉదయం అన్నమయ్య జిల్లాలో జరిగింది. ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాండిచ్చేరి విలియనూర్‌కు చెందిన కార్తీక్‌ (33) బొలెరోలో మదనపల్లి మీదుగా బెంగళూరుకు బొలెరోలో వెళ్తున్నాడు. బొలెరో మదనపల్లె మండలంలోని చీకిలబైలు సమీపంలోని మార్గంమధ్యలో ఉన్న బార్లపల్లె వద్దకు రాగానే.. ఐషర్‌ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ దుర్ఘటనలో బొలెరో డ్రైవర్‌ కార్తీక్‌ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ మహమ్మద్‌ రఫీ, ఎస్‌ఐ రామాంజనేయులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కు పోయిన మృతదేహాన్ని జేసీబీ సాయంతో వెలితీశారు. పరిశీలన అనంతరం మృతుడు పాండిచ్చేరికి చెందిన కార్తీక్‌గా గుర్తించి గంట పాటు శ్రమించి బయటికి తీశారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement