● పారదర్శక పాలన అందిస్తా
● క్రీడలు, మౌళిక వసతులకు ప్రాధాన్యత
● వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటా చలపతి
సాక్షి, మదనపల్లె: తనను గెలిపిస్తే మదనపల్లె అభివృద్ధి చేయడంతోపాటు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటా చలపతి అన్నారు. ప్రజలు ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మదనపల్లె అభివృద్ధి, ప్రణాళికపై శనివారం ఆయన మాట్లాడుతూ తాను గెలిస్తే చేపట్టదలచిన కార్యక్రమాల ప్రణాళికను వివరించారు.
● దశలవారీగా కార్యక్రమాల అమలు, పట్టణ ప్రజలకు మౌళిక వసతుల కల్పన, అభివృద్ధిని సమాంతరంగా అందించేలా కార్యాచరణ అమలు చేస్తానని అన్నారు. వాటిలో.. మహిళల భద్రత, గౌరవం కోసం పింక్ టాయిలెట్లు నిర్మాణం, ప్రధాన ప్రదేశాల్లో, వ్యాపార సముదాయాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్, బేబీ ఫీడింగ్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
● పట్టణంలోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు చదువు కోసం సౌకర్యవంతమైన వసతి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక వసతులు, యువత కోసం వ్యక్తిత్వ వికాస కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
● క్రీడాకారుల కోసం బాస్కెట్ బాల్, వాలీబాల్, క్రికెట్, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు సదుపాయాలు, క్రీడల ప్రోత్సాహానికి మైదానాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
● ప్రజల సమస్యలకు నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ చైర్మన్ కార్యక్రమం నిర్వహణ, ఫిర్యాదులపై తక్షణం
● వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించి, తక్షణమే పరిష్కరిస్తూ వార్డుల్లో అభివృద్ధికి కార్యాచరణ అమలు చేస్తామన్నారు.
● స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కోసం పైప్‌లైన్ల మరమ్మతులు, కొత్త పైపులైన్ల విస్తరణ చర్యలు. వార్డుల్లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు. మురికినీటి కాలువలకు స్లాబ్ పనులు చేయించడం.
● ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం అమలు. వీధుల్లో, రహదారుల్లో రోడ్ల అభివృద్ధి, ప్రతి వార్డులో ప్రత్యేక కార్యక్రమాలు, చెత్త సేకరణ, తడి–పొడి చెత్తలను వేరు చేసిన వ్యర్థాల నిర్వహణ.
● ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ట్రాఫిక్ సిగ్నల్స్, అక్రమ పార్కింగ్ నియంత్రణకు చర్యలు. అవసరమైన చోట వన్‌న్‌వే, పార్కింగ్ నియమాల అమలు. ప్రభుత్వ నిధుల సద్వినియోగం, ప్రజా పనుల్లో జవాబుదారీతనం, అవినీతి ఫిర్యాదులపై నిబంధనల ప్రకారం విచారణకు సహకారం. అవినీతికి తావులేని పారదర్శక పాలన అందజేస్తామన్నారు.
● పట్టణంలోని అన్ని పార్కుల అభివృద్ధి, ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్, వ్యాయామ పరికరాల ఏర్పాటు.
● కాలుష్య నియంత్రణకు పట్టణమంతటా విస్త్రృతంగా మొక్కలు నాటడం. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు. ప్రధాన రహదారులు, కూడళ్ల సుందరీకరణ. గోడలపై పట్టణ చరిత్ర ప్రతిబింబించే చిత్రాలు, పట్టణ ప్రధాన కూడళ్లకు డెకరేటివ్ లైటింగ్ కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు.


