సరిగ్గా పాతికేళ్ల క్రితం | - | Sakshi
Sakshi News home page

సరిగ్గా పాతికేళ్ల క్రితం

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

సాక్షి, మదనపల్లె : 2000 ఏడాదిలో జరిగిన మున్సిపల్‌ చైర్మన్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అప్పటి టౌన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ రాటకొండ విజయకుమార్‌, ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చైర్మన్‌ పదవి కోసం తలపడ్డారు. ఈ ఎన్నికలనాటికి రాటకొండ శోభ టీడీపీ ఎమ్మెల్యేగా, చంద్రబాబు సీఎంగా ఉన్నారు. కౌన్సిల్‌ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు వ్యవహరంలో టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకుడు ఎస్‌ఏ.మస్తాన్‌కు కౌన్సిల్‌ టికెట్‌ నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన మస్తాన్‌ టీడీపీ తిరుగుబాటు చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రధాన అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా ఈ ఎన్నికలో మస్తాన్‌ 1,387 ఓట్లు సాధించారు. దాంతో టీడీపీ విజయానికి గండి పడగా చెల్లని ఓట్లు 3,500కు పైగా పడ్డాయి. ఈ ఎన్నికలో నరేష్‌కుమార్‌ రెడ్డి 1,200 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రసవత్తరంగా సాగిన ఈ ఎన్నిక ఫలితం కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసింది. ఈ ఎన్నికలో అప్పటి కాంగ్రెస్‌ నాయకుడైన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకపాత్ర పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement