మదనపల్లె టౌన్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డ్రై డే అమల్లో ఉండగా అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని మదనపల్లె ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎకై ్సజ్ సీఐ భీమలింగ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మదనపల్లె పట్టణానికి చెందిన షేక్ సయ్యద్ సాహెబ్ 180 ఎంఎల్ చొప్పున 16 మద్యం బాటిళ్లను సుజుకి యాక్సెస్ వాహనంలో విక్రయానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మద్యం బాటిళ్లతో పాటు వాహనాన్ని సీజ్ చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి అక్రమ మద్యం రవాణా జరగకుండా నిఘా పెట్టామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.


