● ఓటర్లకు
సాక్షి, మదనపల్లె: మదనపల్లె పట్టణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తించి పట్టం కట్టాలని రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి శనివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల జగనన్న పాలనలో మదనపల్లె పట్టణ ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా రూ.500 కోట్ల మేర నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా 45 సచివాలయాల పరిధిలో రూ.4.50 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది అన్నారు. తన ఎంపీ కోటా నిధుల ద్వారా కూడా అభివృద్ధి పనులు చేయించామన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కోసం, అభివృద్ధి పనులకు గత మున్సిపల్ కౌన్సి ల్ ద్వారా రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖ ల ద్వారా పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ చైర్మన్, వార్డు కౌన్సిల్ అభ్యర్థులను భారీ ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పట్టణ ప్రజలకు విన్నవిస్తున్నట్లు మిథున్ రెడ్డి పేర్కొన్నారు.


