విద్యావైభవానికి వందనం | - | Sakshi
Sakshi News home page

విద్యావైభవానికి వందనం

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

సత్యాన్వేషణతో జ్ఞానోదయం

● రివర్‌ స్కూల్‌ విద్యా విప్లవం

● వందేళ్ల వేడుకకు సిద్ధమైన రిషివ్యాలీ

● నేడు దేశ విదేశాల నుండి పూర్వ విద్యార్థుల రాక

● జిడ్డు కృష్ణమూర్తి తాత్వికతకు ప్రతీకగా శతాబ్ది సమ్మేళనం

కురబలకోట: కురబలకోట మండలంలోని తెట్టు గ్రామంలో ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన రిషివ్యాలీ విద్యాలయం వందేళ్లుగా విద్యాకుసుమాలు విరబూస్తూ ఎంతో ఘనత సాధించింది. వందేళ్ల వేడుకకు ఈ విద్యాలయం సిద్ధమైంది. శుక్ర, శనివారాల్లో అల్యూమిని నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుండి ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు 500 మందికి పైగా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. 80 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా ఆసక్తితో ఇక్కడికి విచ్చేశారు. స్కూల్‌ అనుభవాలను ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ స్కూల్‌ గురించి అభిప్రాయాలను పంచుకోనున్నారు.

● ఈ రెండు రోజులు వివిధ అంశాలపై చర్చలు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలి పారు. వివిధ దేశాలకు చెందిన వారు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. జిడ్డు కృష్ణమూర్తి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ విద్యా బోధన ఉంటుంది. రిషివ్యాలీ స్కూల్‌ సువిశాల విస్తీర్ణంలో ఉంది. 4వ తరగతి నుండి టెన్‌ ఫ్లస్‌ టూ వరకు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది. సెంట్రల్‌ సిలబస్‌లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతోంది. జిడ్డు కృష్ణమూర్తి విద్యా తాత్వికతకు ప్రతీకగా నిలిచిన రిషివ్యాలీ స్కూల్‌ శతాబ్ధి ప్రస్థానం సందర్భంగా జరుగుతున్న ఈ సమ్మేళనం పూర్వ విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని ఇనుమడింపజేయనుంది. రిషివ్యాలీ చరిత్రలో చిరస్మరనీయ ఘట్టంగా నిలవనుంది.

సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అని జిడ్డు కృష్ణమూర్తి అంటారు. చదు వు అనేది బలవంతంగా కాకుండా ఆసక్తి తో నేర్చుకునేదిగా ఉండాలి. చదువు ఉద్యోగాల కోసమే కాదు. విలువలు పెంపొందించేవిగా కూడా ఉండాలి. అంతేతప్ప సర్టిఫికెట్లు ఇచ్చి పంపేవిగా ఉండకూడదు. ఏ స్కూల్‌లో అయినా తొలుత విద్యార్థులలో బడి పట్ల ఉన్న భయాన్ని పోగొట్టాలి. పిల్లలు చదువు నేర్చుకునే విధానం, వంద పూటలు చెప్పలేని భావాన్ని ఒక బొమ్మ చెబుతుంది. అందుకే బొమ్మలు, ఆట, పాట, కథల ద్వారా విద్యా బోధన అవసరం.

రిషివ్యాలీ స్కూల్‌కు అనుబంధంగా రిషివ్యాలీ రివర్‌ స్కూల్‌ కూడా దేశ, విదేశాలలో నిశ్శబ్ద విప్లవం సాగిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో కూడా ఈ విద్యా విధానం నడుస్తోంది. రివర్‌లో పాఠ్యపుస్తకాలు లేకుండా కార్డులు బొమ్మల ద్వారా విద్యా బోధన ప్రత్యేకత. టీచర్‌ ఓ సహాయకుడిగా మాత్రమే వ్యవహరిస్తారు. ఒక టీచర్‌తోనే ఐదు తరగతులు ఒకే తరగతిలో నిర్వహిస్తారు. వుల్టీగ్రేడ్‌ వుల్టీలెవల్‌లో ఇక్కడ విద్యా భోధన ఉంటుంది. విద్యార్థి తనకు తానే (సెల్ప్‌ లర్నింగ్‌) నేర్చుకునే అవకాశం ఉంది. విద్యార్థి సామర్థ్యం బట్టి చదువులో ముందుకు వెళ్లవచ్చు. బట్టీ పట్టడం, బలవంతపు చదువులు ఇక్కడ ఉండవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement