50 ఏళ్లుగా ఇలాంటి దాడులు చూడలేదు | - | Sakshi
Sakshi News home page

50 ఏళ్లుగా ఇలాంటి దాడులు చూడలేదు

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

● కూటమి ప్రభుత్వానికి

700 రోజులే ఆయుష్షు

● పీలేరు మాజీ ఎమ్మెల్యే

చింతల రామచంద్రారెడ్డి

కలకడ : ‘రాజకీయ చరిత్రలో 50 ఏళ్లగా ఇలాంటి దాడులు చూడనేలేదు. దారుణంగా మహిళలపై కూడా టీడీపీ నాయకులు రౌడీల్లాగా దాడులు చేస్తూ, కనీసం నామినేషన్లు వేయకుండా అడ్డుపడటం ఇదే మొదటిసారి చూశాను’ అని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కదిరాయచెర్వులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానం, ఏజెంట్ల నియామకం గురించి తెలియజేశారు. టీడీపీ ప్రారంభించిన ఈ దాడుల సంస్కృతి ఎక్కకి దారి తీస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదన్నారు. పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, కలకడ మండలంలోని కోన, ఎర్రకోటపల్లె ఎంపీటీసీ అభ్యర్థుల విజయం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని అన్నారు.

ఉదయం నుంచే క్యూలో ఓటర్లు ఉండాలి

ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ బూత్‌ వద్ద క్యూలో ఉండాలని పేర్కొన్నారు. టీడీపీ అల్లరి మూకలు దాడులు చేస్తే ఫొటోలు, వీడియోలు తీసి ఎన్నికల సంఘానికి, పోలీస్‌ ఉన్నతాధికారులకు పంపాలని, అప్పుడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానకి అవకాశం ఉంటుందని గుర్తు చేశారు.

కలకడలో నామినేషన్ల పర్వం దారుణం

పీలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దారుణంగా దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కలకడలో 59 మంది నామినేషన్ల పూర్తి వివరాలపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలోని ప్రతి కార్యకర్త, నాయకులు, వైఎస్సార్‌ సీపీ కుటుంబ సభ్యులు ఓటర్లను ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ కార్యదర్శులు జల్లా రాజగోపాల్‌రెడ్డి, బరకం రవికుమార్‌రెడ్డి, కన్వీనర్‌ కమలాకర్‌రెడ్డి, జిల్లా రైతు సంఘం కార్యదర్శి ద్వారకనాథరెడ్డి, బరకం వెంకటప్రసాద్‌రెడ్డి, కుమార్‌నాయుడు, మోహన్‌రాజా నాయుడు, నాయకులు సరళ, రవికుమార్‌, షావత్‌అల్లిఖాన్‌, కె.ఎస్‌.మస్తాన్‌ అహమ్మ ద్‌, మధుసూదన్‌రెడ్డి, శివారెడ్డి, వెంకట్రమణరెడ్డి, శివకుమార్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, మాధవరెడ్డి, ఎంపీ బాషాఖాన్‌, రవి, మున్నా, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, రెడ్డిశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, రామాంజులు, జీవీ కిషోర్‌, శ్రీనివాసులురెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement