వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై బైండోవర్‌ కేసు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై బైండోవర్‌ కేసు

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

ములకలచెరువు : ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులపై కూటమి నాయకులు పోలీసులతో కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌ చేసి బైండోవర్‌ కేసులు బనాయిస్తున్నారు. ఇప్పటి దాకా సుమారుగా 30 మందిని బైండోవర్‌ చేశారు. మున్ముందు వంద మందికి పైగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై బైండోవర్‌ కేసులు పెట్టేందుకు పోలీసులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.

కారును ఢీకొన్న

ట్రావెల్స్‌ బస్సు

గుర్రంకొండ : కారును ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన గుర్రంకొండలో జరిగింది. పొలీసుల కథనం మేరకు.. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన సంజనమ్మ(68) కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. ఈమెకు చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు సమీపంలో ఉన్న విరూపాక్షపురంలో ఆయుర్వేద వైద్య చికిత్సల కోసం తీసుకెళ్లాలని నిర్ణయించుకొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సంజనమ్మతోపాటు ఆమె కుమార్తె అరుణమ్మ(53, కుమారుడు మునేంద్ర(28) కలిసి కారులో పలమనేరుకు బయలుదేరారు. కారు అర్ధరాత్రి గుర్రంకొండ సమీపంలోని చిట్టిబోయపల్లె వద్దకు చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న రాజంపేట–బెంగుళూరు ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో సంజనమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కారు లో మిగిలిన అరుణమ్మ, మునేంద్ర, డ్రైవర్‌ ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ అరుణ మ్మ పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచనల మేరకు కడప రిమ్స్‌ 108 వాహనంలో తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

పుంగనూరు : పట్టణంలోని మేలుపట్ల ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, గుర్తింపు కోసం అవసరమైన ఆనవాళ్లను సేకరించారు. మృతుడి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై నలుపురంగు టీషర్టు, నీలంరంగు నైట్‌ఫ్యాంట్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement