3న నెట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ జిల్లా జట్లు ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

3న నెట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ జిల్లా జట్లు ఎంపికలు

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

మదనపల్లె సిటీ: ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 3న బాస్కెట్‌బాల్‌, నెట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపికలు జరుగుతాయని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు తెలిపారు. బాస్కెట్‌బాల్‌ అండర్‌–17 బాల, బాలికల విభాగంలో పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వాల్మీకిపురంలో జరుగుతాయన్నారు. నెట్‌బాల్‌ అండర్‌ –17 బాల,బాలికల జట్లు ఎంపికలు సోమల జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతాయన్నారు. ఉదయం 9 గంటలకు ఈ ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని, పాల్గొనే క్రీడాకారులు స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌ జిరాక్సు, స్పోర్ట్సు కిట్‌తో హాజరు కావాలన్నారు.

నేడు జిల్లా స్థాయి

చెస్‌ ఎంపికలు

కేవీపల్లె : మండలంలోని గ్యారంపల్లె ఏపీ గురుకుల పాఠశాలలో శుక్రవారం అండర్‌ 14 జిల్లా స్థాయి బాల బాలికల చెస్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయులు నూర్‌ మహమ్మద్‌, డీఎస్‌జీ కార్యదర్శులు రమేష్‌, కృష్ణ తెలిపారు. గురువారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, జనన తేదీ ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్‌ తీసుకురావాలని కోరారు. విద్యార్థులు ముందుగానే లీప్‌ యాప్‌లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకుని ఉండాలన్నారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే ఎంపిక పోటీలకు హాజరు కావాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ముమ్మరంగా వాహనాల తనిఖీ

మదనపల్లె టౌన్‌: జిల్లా ఎక్సైజ్‌ అధికారి మధుసూదన్‌ ఆదేశాల మేరకు గురువారం బి.కొత్తకోట మండలం, నాయుని బావి క్రాస్‌ వద్ద ఎకై ్సజ్‌ పోలీసులు, ఎస్టీఎఫ్‌ సిబ్బందితో కలిసి రూట్‌ మార్చ్‌, వాహన తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేసినట్లు మదనపల్లె ఎకై ్సజ్‌ సీఐ భీమలింగ తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు జెబీయల్లా, శశి, వై. బాబు, హెడ్‌ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.

రక్తదానం చేసిన ఎస్పీ

మదనపల్లె టౌన్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మదనపల్లెలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి స్వయంగా రక్తదానం చేసి పోలీసు సిబ్బందిలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఎందరో ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. రక్తదానం చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement