పెద్దమండ్యం : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు పిలుపునిచ్చారు. మండలంలోని కలిచెర్లలో మాజీ సింగిల్ విండో చైర్మన్ కలిచెర్ల సుధాకరరెడ్డితో గురువారం ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పెద్దమండ్యం జెడ్పీటీసీ అభ్యర్థి ఆవుల మల్లికార్జునరెడ్డి సమావేశమయ్యారు. ఎంపీటీసీ స్థానాల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి చర్చించారు. మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పోలేరమ్మ గుడిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థితో కలిసి ఎంపీ, ఎమ్యెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమండ్యం జెడ్పీటీసీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే, కలిచెర్ల మాజీ సింగిల్ విండో చైర్మన్లకు ఆవుల మల్లికార్జునరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, శిద్దవరం విశ్వనాథరెడ్డి, ఎమ్యెల్యే తనయుడు పెద్దిరెడ్డి అభినయ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక, మాజీ జెడ్పీటీసీ గుర్రం రమేష్, మాజీ సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


