నవ్యాంధ్రలో మరో చరిత్ర | - | Sakshi
Sakshi News home page

నవ్యాంధ్రలో మరో చరిత్ర

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

పేదలకు మేలు చేయాలంటే మంచి మనసు ఉండాలి.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే చిత్తశుద్ధి ఉండాలి.. అభివృద్ధి చేయాలంటే అంకితభావం ఉండాలి.. సంక్షేమపాలన అందజేయాలంటే దీక్షా దక్షత ఉండాలి.. చెప్పినవన్నీ చేయాలంటే మాటకు కట్టుబడే నైజం ఉండాలి.. ఇవన్నీ జననేత వైఎస్‌ జగన్‌లో ఉన్నాయి. నవరత్న పథకాలు అమలు చేసి పాలన ఎలా చేయాలో చేసి చూపించారు. నవ్యాంధ్రలో మరోచరిత్ర లిఖించారు.

సాక్షి, మదనపల్లె: మదనపల్లె మున్సిపల్‌ కౌన్సిల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టింది. రూ.200 కోట్లకు పైబడిన నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు, శివారు ప్రాంతాల్లో, మురికివాడల్లో అభివృద్ధికి బాటలు వేశారు. ప్రధానంగా మురుగునీటి కాలువలు, సిమెంటు, తారు రోడ్లు, పైప్‌ లైన్లు, నీటి సరఫరా మెరుగు, పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఖర్చు చేశారు.

ఈ ఐదేళ్లలో పథకాల ద్వారా అందిన నిధులతో పాటు, మున్సిపాలిటీ స్వయంగా అర్ధించిన ఆదాయంతో ఈ అభివృద్ధిని చేశారు. మున్సిపాలిటీకి 2020–21 నుంచి 2024–25 వరకు 15వ ఆర్థిక సంఘానికి చెందిన టైడ్‌ నిధులు రూ.25,98,53,284, అన్‌టైడ్‌ నిధులు రూ.19,12,75,395 వచ్చాయి.

● జగనన్న పాలనలో మదనపల్లి మున్సిపాలిటీ బడ్జెట్‌ అంచలంచెలుగా పెరుగుతూ వచ్చింది. సొంతంగా సమకూర్చుకునే ఆదాయం భారీగా పెరిగింది. వివిధ రకాల పన్నులు, వసూళ్లు పెరగడంతోపాటు, పథకాల ద్వారా అందే నిధులతో బడ్జెట్‌ భారీగా పెరిగింది. ప్రస్తుతానికి సంవత్సర మదనపల్లె మున్సిపాలిటీ బడ్జెట్‌ రూ.228 కోట్లకు చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కనీసం 10 శాతం పెంపుతో బడ్జెట్‌ రూపొందించే అవకాశం ఉంది.

2021–26 వైఎస్‌ఆర్సీపీ పదవి కాలం పూర్తి అయ్యేనాటికి మున్సిపాలిటీలో నిధులు రూ.70 కోట్లకు పైబడి నిల్వ ఉంది. ఇంత భారీ ఆర్థికంగా నిల్వ ఎప్పుడూ లేదని చెప్తున్నారు. కొత్త పాలక వర్గం వచ్చాక లెక్కలు తేలనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement