పోలీసు విధులపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

పోలీసు విధులపై అవగాహన

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

మదనపల్లె టౌన్‌: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మదనపల్లెలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘ఓపెన్‌ హౌస్‌’ ప్రదర్శనను జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులకు పోలీసు శాఖ విధులు, ఆధునిక ఆయుధాలు, నిఘా డ్రోన్ల పనితీరు, బాంబ్‌ స్క్వాడ్‌ వ్యవస్థలు, అల్లర్ల నివారణకు ఉపయోగించే వజ్ర వాహనం గురించి పోలీసు సిబ్బంది వివరించారు. అలాగే డ్రగ్స్‌ నివారణ, మహిళా భద్రత కోసం రూపొందించిన శ్రీశక్తిశ్రీ యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు చట్టాల గురించి తెలుసుకోవాలని, ట్రాఫిక్‌ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ బి.ప్రసాద్‌, ఆర్‌ఐలు, సీఐలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement