రొంపిచెర్ల మండలం గానుగచింత లో ప్రచారం చేస్తున్న పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
మదనపల్లెలో ప్రచారం చేస్తున్న నిసార్‌అహ్మద్, తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింకా చలపతి
రొంపిచెర్ల: స్థానిక సంస్థలల ఎన్నికలలో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన బుధవారం రొంపిచెర్ల మండలం గానుగచింత దాసరిగుడెంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సూపర్‌సిక్స్, 50 సంవత్సరాలకు బీసీలకు పెన్షన్, నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అయితే కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలపైన అవుతున్న ఇంత వరకు అమలు చేయలేదని ఆరోపించారు. కూటమి దౌర్జన్యాలను ప్రజలు చూస్తున్నారని వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. రొంపిచెర్ల జెడ్పీటీసీగా కోటా సుష్మను గెలిపించాలని కోరారు. గానుగచింత దాసరిగుడెంలో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, చిచ్చిలి రెడ్డిశ్వర్ రెడ్డి, సలీంబాషా, వెంకటరమణ, శ్రీనాఽథ్ రామకృష్ణనాయుడు, సురేంద్రనాయుడు, కుమార్ నాయుడు, విజయశేఖర్, అల్లాబక్స్, బావాజీ, మహబుబ్‌బాషా, ఓబులేసు, సూర్య నారాయణ రెడ్డి, శ్రీనాధ నా యుడు, హరికృష్ణారెడ్డి, యర్రంరెడ్డి పాల్గొన్నారు.


