రాయచోటి : ఆపస్ అన్నమయ్య జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం రాయచోటిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు శవన్న బాలాజీ హాజరయ్యారు. సంఘం అభివృద్ధికి జిల్లా, మండల స్థాయి నాయకులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. సంఘం బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, జిల్లా మండల స్థాయిలో సంఘ కార్యకలాపాల విస్తరణ తదితర అంశాలపై నాయకులు చర్చించారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేయాలని తీర్మానించారు.
నూతన కార్యవర్గం
జిల్లా గౌరవ అధ్యక్షులు కె.రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పరశురాం, ప్రధాన కార్యదర్శి పచ్చార్ల సుధాకర్, కోశాధికారి సొరకాయల శ్రీనివాసులు, సహాధ్యక్షుడు కె.వెంకటేష్, అదనపు ప్రధాన కార్యదర్శి జి.బాలాజీ, భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు శివశంకర బాలాజీ, నాగులయ్య, రవీంద్ర బాబు, ఓబుల్‌రెడ్డి, ఆర్.రామాంజనేయరెడ్డి, వి.సుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శులు రెడ్డి శేఖర్, డి.నాగరాజు, ఆర్.ఆంజనేయులు, ఈశ్వరయ్య, జిల్లా మీడియా ఇన్‌చార్జ్ కళ్యాణ్, జిల్లా సేవా ప్రముఖ్ కె.నరసింహులు, జిల్లా మహిళా కన్వీనర్ బి. పావనీ, జిల్లా కోశాధికారి సొరకాయల శ్రీనివాసులు, జిల్లా సహకోశాధికారి బి. మల్లికార్జునను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆపస్ జిల్లా నాయకులతోపాటు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.


