స్థానిక సమరంలో విజయఢంకా మోగించాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరంలో విజయఢంకా మోగించాలి

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

మదనపల్లి (కురబలకోట) : స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. జగన్‌ పథకాలు జనాదరణ పొందాయన్నారు. ప్రజలు మన పార్టీ వైపు ఉన్నారన్నారు. వాటిని ఓట్లుగా మలచుకుని పార్టీ విజయానికి బాటలు వేయాలన్నారు. కేడర్‌, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు కలసి కట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.

ఎంపీటీసీలకు ఎంపీ అభయం

నామినేషన్లు తిరస్కరణకు గురై ఆందోళనలో ఉన్న ఎంపీటీసీ అభ్యర్థులకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా తనను కలసిన బాధిత అభ్యర్థులతో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల తిరస్కరణతో నిరాశ చెందకుండా ధైర్యంగా ఉండాలన్నారు. నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలను అనుసరించి అప్పీల్‌ ప్రక్రియలో న్యాయం జరిగేలా చూస్తానన్నారు.

వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు ఎంపీ

పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement