గుర్తుతెలియని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని యువకుడి మృతి

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

గుర్తుతెలియని యువకుడి మృతి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు

పీలేరు రూరల్‌ : అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. సాయంత్రం ముంబయి–నాగర్‌కోయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడిన యువకుడి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని హెడ్‌కానిస్టేబుల్‌ బాషా తెలిపారు. కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువకుడిని గుర్తు పట్టిన వ్యక్తులు సెల్‌ నంబర్‌:9133109537కు సమాచారం అందించాలని కోరారు.

మదనపల్లె టౌన్‌ : కారు ఢీకొనడంతో ఓ రైతు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం రాత్రి గుర్రంకొండ మండలంలో జరిగింది. ఎస్సై రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. చెర్లోపల్లి సమీప దద్దాలవారిపల్లెకు చెందిన రైతు తిరుమల చిల్లర అంగడిలో సరుకులు కొనుగోలు చేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా, చిన్నమండెం వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుమల తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. కారులో ప్రయాణిస్తున్న చిన్నమండెంకు చెందిన భవ్య శ్రీ, ఎం.ఆర్‌. శర్మలు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement