టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

మైదుకూరు : మైదుకూరు రూరల్‌ మండల పరిధిలో ఎన్‌.ఎర్రబల్లె పంచాయతీకి చెందిన బొజ్జ ఓబన్న 20 కుటుంబాల వారితో కలిసి గురువారం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మైదుకూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పంచాయతీలోని లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన బొజ్జ ఓబన్న తదితర 20 కుటుంబాల వారికి పార్టీ కండువాలను వేసి రఘురామిరెడ్డి వారిని వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. బొజ్జ నారాయణ, బొజ్జ కృష్ణయ్య, బొజ్జ పెద్ద ఓబయ్య, బొజ్జ బాలయ్య, భూమిరెడ్డి నారాయణరెడ్డి, భూమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, మేకల వీరనారాయణ, బయన బోయిన నరసింహులు, అంకిరెడ్డిపల్లె రమణారెడ్డి, బొజ్జ నాగరాజు, బొజ్జ చిన్న ఓబులేసు, బొజ్జ చిన్న ఓబయ్య, హరికోటం ఓబయ్య, భూమిరెడ్డి బసిరెడ్డి, అంబవరం ఓబయ్య వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు.

వైఎస్సార్‌సీపీలోనే గుర్తింపు

ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఎన్‌.ఎర్రబల్లె పంచాయతీలో టీడీపీ నుంచి 20 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలోకి చేరడం అభినందనీయమని అన్నారు. టీడీపీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు లేదని, అది ఒక్క వైఎస్సార్‌సీపీలో మాత్రమే ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని సూచించారు.

ఎంత కష్టపడినా గుర్తింపు లేదు

టీడీపీ అభివృద్ధికి ఎంతో క్టష్టపడ్డామని ఎన్నో ఇబ్బందులు పడి పార్టీ గెలుపు కోసం కృషి చేశామని అయినా అక్కడ గుర్తింపు లేదని టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన బొజ్జ ఓబన్న విలేకరులతో అన్నారు. అధికారంలోకి వచ్చాక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, అధికారంలో ఉండి కూడా పడరాని ఇబ్బందులు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టీడీపీలో న్యాయం జరగలేదని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి విన్నవించగా ఆయన సంతోషంగా తనను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఎంపీటీసీ అభ్యర్థిగా బొజ్జ ఓబన్న

ఎన్‌.ఎర్రబల్లె ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బొజ్జ ఓబన్నను మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి నియోజకవర్గంలో తొలిగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బొజ్జ ఓబన్న తమ ఎంపీటీసీ అభ్యర్థి అని రఘురామిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ గల్లా నరసింహారెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ ఊటుకూరు రఘురామిరెడ్డి, సీనియర్‌ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, నేట్లపల్లి శివరాం, తవ్వా వెంకటయ్య, పెద్దిరెడ్డి దశరథరామిరెడ్డి, పెద్దిరెడ్డి ఉపేంద్రరెడ్డి, పెరుగు రాముడు, నాగేశ్వరరెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement