‘సహిత విద్య’ను పక్కాగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సహిత విద్య’ను పక్కాగా అమలు చేయాలి

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

– డీఈఓ సుబ్రమణ్యం

మదనపల్లె సిటీ: సహిత విద్యా కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని డీఈఓ డాక్టర్‌ సుబ్రమణ్యం అన్నారు. బుధవారం స్థానిక ఓ కాలేజీలో మండల విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ప్రభుత పరంగా అందజేయబడుతున్న వివిధ సౌకర్యాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగ హక్కుల చట్టం–2016, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల హక్కులు, సమగ్ర, అవరోధ రహిత విద్య, ప్రశస్త్‌, దృష్టి యాప్‌లపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకునేలా వారిలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష సహిత విద్య సమన్వయకర్త జనార్థన్‌, జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ‘నేతన్న సేవ’

మదనపల్లి (కురబలకోట): అర్హత కలిగిన చేనేత కార్మికులందరికీ నేతన్న సేవ పథకం వర్తింపజేస్తామని జిల్లా చేనేత, జౌళి శాఖ ఇన్‌చార్జి ఏడీ శ్రీదేవి తెలిపారు. మలి విడత లబ్ధిదారుల ఎంపికలో భాగంగా పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో మూడు రోజులుగా ఇంటింటికి వెళ్లి మగ్గాలపై క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ తొలి విడతలో కొందరికి నిధులు జమ చేశామన్నారు. మళ్లీ పలువురి నుంచి వినతు లు రావడంతో రెండో విడత నిధులు విడుదలకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. స్థానికంగా స్థిరపడి మగ్గం కలిగిన వారిని గుర్తించి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేశామని ఆమె వివరించారు.

2న సర్వసభ్య సమావేశం

కడప ఎడ్యుకేషన్‌: కడప జిల్లా సెకండరీ, ప్రైమరీ టీచర్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు కడప సీఎస్‌ఐ హైస్కూల్లో నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, బాలశౌరిరెడ్డి తెలిపారు. సొసైటీ సభ్యులు, పబ్బాపురం ప్లాట్లదారులు సమావేశానికి హాజరుకావాలని సూచించారు.

కొనసాగుతున్న

ఎస్‌జీఎఫ్‌ జిల్లా ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14,17 జిల్లా స్థాయి ఎంపికలు కొనసాగాయి. బుధవారం కడపలోని డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో బాలబాలికలకు రెజ్లింగ్‌, తాంగ్‌టా, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలను ఎస్‌జీఎస్‌ సెక్రటరీలు విజయలక్ష్మీ, నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా జట్టును ఎంపిక చేశారు. వ్యాయామ కోచ్‌లు సాజిత్‌, జిలానీ బాష, శిశశంకర్‌రెడ్డి పటిష్టంగా పోటీలను నిర్వహించారు.

అరటి పంట దగ్ధం

కాశినాయన : మండలంలోని సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన రైతు విజయ కుమార్‌రెడ్డి అరటి తోటలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల నిప్పు అంటుకుని రెండు ఎకరాల అరటి పంట దగ్ధమైంది. పోరుమామిళ్ల అగ్నిమాప కేంద్రానికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. రెండు ఎకరాల అరటి పంటతోపాటు డ్రిప్‌ పరికరాలు పూర్తిగా కాలిపోయాయని, దాదాపు రూ.2లక్షలు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement