టీడీపీ అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవవేతనం రూ.10 వేలు ఇస్తామని చెప్పి చివరకు మా ఉద్యోగాలే తొలగించి మోదటికే మోసం చేశారు. ప్రస్తుతం కూలిపనులు చేసుకునేలా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజల వద్దకే వెళ్లి పథకాలు అందించిన మాకు ఉద్యోగాలు తొలగించి చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని నిరూపించుకున్నారు. ఇప్పుడేమో సోషల్ మీడియా వాళ్లకు లక్షలు ఇస్తున్నారు.
– వై. శంకరమ్మ, మాజీ వలంటీర్,
మద్దినాయునిపల్లి, ములకలచెరువు మండలం


