సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

సాక్షి, మదనపల్లె: మదనపల్లెలో శుక్రవారం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ.జనార్దన్‌ రెడ్డి, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌తో కలిసి పరిశీలించారు. అలాగే కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ హెలిప్యాడ్‌ స్థలాన్ని, సభ వేదిక, ప్రజలు వచ్చే దారి, ప్రముఖుల భద్రతకు సంబంధించిన చర్యలను ఎస్పీతో కలిసి పరిశీలించారు. భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఎమ్మెల్యేలు షాజహాన్‌ బాషా, అమరనాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2న మదనపల్లెలో ట్రాఫిక్‌ ఆంక్షలు

మదనపల్లె టౌన్‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన నేపథ్యంలో అక్టోబర్‌ 2న మదనపల్లెలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. అక్టోబర్‌ 2న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిత్తూరు–అనంతపురం బైపాస్‌ పరిధిలోని పుంగనూరు జంక్షన్‌ నుంచి అన్నమయ్య సర్కిల్‌ వరకు భారీ, అతిభారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. మదనపల్లె పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదు.

దారి మళ్లింపు వివరాలు

బెంగళూరు నుంచి కడప, అనంతపురం వెళ్లే వాహనాలు తాడిగల్లు క్రాస్‌ వద్ద బి.కొత్తకోట మీదుగా, కడప నుంచి బెంగళూరు వాహనాలు అంగళ్లు ఫ్లైఓవర్‌ కింద నుంచి బి.కొత్తకోట మీదుగా వెళ్లాలి. అనంతపురం–బెంగళూరు వాహనాలు బి.కొత్తకోట మీదుగానే వెళ్లాలి. తిరుపతి నుంచి అనంతపురం వాహనాలు సీటీఎం మీదుగా, చిత్తూరు వాహనాలు పుంగనూరు, రామసముద్రం మీదుగా వెళ్లాలని సూచించారు.

జిల్లా ఏఎస్పీగా జయ శర్మ

మదనపల్లె టౌన్‌: జిల్లా నూతన ఏఎస్పీగా జయశర్మ నియమితులయ్యారు. 2024 బ్యాచ్‌కు చెందిన ఈమెతో పాటు మరో ముగ్గురు ప్రస్తుతం గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌గా ఉన్నారు. వీరి ప్రొబేషన్‌ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు జయ శర్మను మదనపల్లె ఏఎస్పీగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement