జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా...
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో
వీఎన్ పల్లి మండలంలో బీడుగా మారిన పొలం
సాక్షి, మదనపల్లె: ఎల్‌నినో తెచ్చిన కరువుకాటుతో జిల్లా వ్యవసాయం తలకిందులైంది. వర్షం జాడలేక, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పంటలు సాగుకు నోచుకోక, పాడికి పశుగ్రాసం కరువై..రైతాంగం అల్లాడిపోతోంది. ఎల్‌నినో రూపంలో కరువుకాటేయడంతో సేద్యం కుదేలైంది. కనుచూపుమేరలో పచ్చదనం కరువైంది. ఫలితంగా వ్యవసాయంతోపాటు పాడి, గొర్రె, పశు పరిశ్రమలు పడకేశాయి.
ప్రమాద ఘంటికలు!
రైతులు గత దశాబ్దకాలంలో పశుగ్రాసం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా పడింది. 34,182 హెక్టార్ల పొలాలు సాగుకు నోచుకోకపోవడంతో బీళ్లుగా మిగిలాయి. ఎక్కడా పచ్చదనం లేదు. కనీసం పశుగ్రాసం కూడా లభించే పరిస్థితి లేదు. జిల్లాలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు భూగర్భ జలమట్టంపై ప్రభావితం చేస్తున్నా యి. జిల్లాలో నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉంది. జిల్లాలోని 25 మండలాల్లో సగం మండలాలకు పైగా నీటిమట్టం భారీగా పడిపోతోంది.
నెల సాధారణ కురిసిన లోటు వర్షపాతం వర్షం వర్షపాతం
జూన్ 75.1 40.4 46.2
జూలై 90.5 3.3 87.2
ఆగష్టు 99.8 17.5 82.4
సెప్టెంబర్ 114.7 0.6 114.1
ములకలచెరువు: మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, కుంటలన్నీ నీరు లేక పూర్తిగా ఎండిపోయాయి. గతంలో పాడిపంటలతో కళకళలాడిన పల్లెలు, ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో వ్యవసాయ బోర్లు సైతం చుక్క నీరు రాక నిలిచిపోతున్నాయి. ఈ కరువు ప్రభావం మూగజీవాలపై తీవ్రంగా పడింది. ఎటు చూసినా పచ్చగడ్డి, తాగేందుకు నీరు లభించక పశువులు, మూగజీవాలు అల్లాడుతున్నాయి. సాగు నీరు, తాగునీటి సమస్యలు రోజురోజుకూ జటిలమవుతుండటంతో పాడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నాళ్లీ నరకం!


