బొజ్జ గణపయ్య పండుగ వచ్చేస్తోంది. ఏటా చవితికి నెల రోజుల ముందే కేసీ కెనాల్ నీటితో పాత కడప చెరువును కళకళలాడించి, నిమజ్జనానికి రూట్ క్లియర్ చేయడం కడప నగరంలో ఆనవాయితీ. కానీ, ఈసారి సీన్ రివర్స్ అయింది! మన ‘కూటమి’ మున్సిపల్ అధికారులు, పాలకులు భక్తి కంటే ‘కక్ష సాధింపు’ ధ్యాసలోనే మునిగిపోయి పాలనపై దృష్టి పెట్టడం మరిచారు. ఫలితంగా పాత కడప చెరువు చుక్క నీరు లేక వెక్కిరిస్తోంది. ‘స్వామీ విఘ్నేశ్వరా.. భక్తుల కష్టాలు ఎలాగూ తీరుస్తావు..ముందు మన పాలకుల అజ్ఞానాన్ని కాస్త తొలగించు తండ్రి!’ అంటూ ప్రజలు ప్రార్థిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప


