గుర్రంకొండ: మండలంలో గత వారం రోజులుగా మే నెల వేసవిని తలపించేలా ఎండలు మండుతుండటంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో ఇలాంటి ఎండలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బండ్లపైనే ఉండే లేత కూరగాయలు ఎండ దెబ్బకు వేడి నీళ్లలో ఉడికించినట్లుగా మాడిపోతున్నాయి. గతంలో రెండు రోజుల పాటు తాజాగా నిల్వ ఉండే కూరగాయలు, ప్రస్తుతం ఒక్క రోజు కూడా తట్టుకోలేక పాడైపోతుండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పంటను కాపాడుకునేందుకు వ్యాపారులు ప్రతి గంటకూ వాటర్ బాటిళ్లతో చల్లటి నీటిని వాటిపై చల్లుతున్నారు.


