అమృతహస్తం పేరిట సేవాసంస్థను స్థాపించిన పట్టం కిరణ్ గంగిరెడ్డి ఆత్మహత్యల నివారణకు విశేషంగా కృషి చేస్తున్నారు. కడప సమీపంలోని కొప్తర్తి పంచాయతీ ఎర్రమాచుపల్లెలో ఉంటున్న ఆయన సొంత ఖర్చులతో కరపత్రాలు ముద్రించి గ్రామాల్లో పంచడం.., కళాశాల విద్యార్థులకు అందచేయడం ప్రారంభించారు. పోలీసుల సహకారం తీసుకుని కళాశాలల్లో అవగాహన సదస్సులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 179 సదస్సులను నిర్వహించి ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన పెంచారు. ఎవరికై నా సమస్యలుంటే 7702443446 నెంబర్‌కు కాల్ చేస్తే పరిష్కారానికి కృషి చేయగలమని ప్రచారం చేస్తున్నారు.
ఆత్మహత్యల నివారణే లక్ష్యం..
క్షణికావేశానికి గురై ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాని వల్ల ప్రతి ఒక్కరికి జీవితకాలం బాధతప్ప ఒరిగేదేమీ ఉండదు. జిల్లాను ఆత్మహత్యల రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా నా వంతు కృషి చేస్తున్నా.
– పట్టెం కిరణ్‌గంగిరెడ్డి, అమృత హస్తం సేవాసంస్థ వ్యవస్థాపకుడు, కడప


