మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి బయటకు కనిపించినంత సంతోషంగా ఉండకపోవచ్చు. ఎవరి మనసులో ఏ బాధ ఉందో మనకు తెలియదు. అందుకే కుటుంబంలో, స్నేహితుల్లో, విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో‘ మాట్లాడుకుందాం.. విందాం.. తోడుగా నిలుద్దాం’ అనే సంస్కృతి పెరగాలి. ఎదుటివారు తమ మనసులోని బాధను చెప్పుకుంటే వినడం ద్వారా ఒక జీవితాన్ని కాపాడవచ్చు. ముఖ్యంగా ఎదిగిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాలి. సానుకూల దృక్పథాన్ని, సమస్యను పలు కోణాళ్లో చూడగలిగే గుణాన్ని వారిలో పెంచాలి. నేటి ఓటమి రేపటి విజయమని చెప్పాలి.


