పరీక్షలో ఫెయిల్‌.. జీవితంలో కాదు! | - | Sakshi
Sakshi News home page

పరీక్షలో ఫెయిల్‌.. జీవితంలో కాదు!

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ‘మదనపల్లెకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని ఇంటర్‌లో ఫెయిల్‌ కావడంతో తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం కుటుంబ సభ్యులను ఎంతగానో కలచివేసింది. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని, ఆశించిన మార్కులు రాలేదని కొందరు విద్యార్థులు తీవ్రంగా కుంగిపోతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడి, భవిష్యత్తుపై భయం వంటి అంశాలు వారిని మానసికంగా వేధిస్తున్నాయి. కానీ ఒక పరీక్షలో ఫెయిల్‌ కావడం అంటే.. జీవితంలో ఫెయినట్లు కాదు. ఒక సంవత్సరం నష్టం కావ చ్చు. ఒక అవకాశం చేజారవచ్చు. కానీ జీవితం మాత్రం ఒక్కటే. అందుకే విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్యను తల్లిదండ్రులు ఓపికగా వినాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement