వేర్వేరు కేసుల్లో ఐదుగురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు కేసుల్లో ఐదుగురు అరెస్టు

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

రాయచోటి టౌన్‌ : రాయచోటి పోలీస్‌ డివిజన్‌ పరిధిలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాలలో వేర్వేరుగా జరిగిన చోరీ కేసుల్లో ఐదుగురిని అరెస్టు చేసినట్లు రాయచోడి డీఎస్పీ కృష్ణమోహన్‌ తెలిపారు. బుధవారం రాయచోటి డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.

రామాపురం మండల కేంద్రంలోని నీలకంట్రావుపేట బస్టాప్‌ సమీపంలోని ఓ ఇంట్లో, సుద్దమళ్ల క్రాస్‌రోడ్డు వద్ద మామిడికాయల మండి సమీపంలో మరో ఇంట్లో వేర్వేరుగా చోరీలు జరిగాయన్నారు. ఈ చోరీల్లో రామాపురం మండలం నల్లగుట్టపల్లెకు చెందిన మానస హరి, కటా రాజగోపాల్‌, వైఎస్సార్‌జిల్లా పెండ్లిమర్రికి చెందిన పాలం నాగ అశ్విని, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం శ్రీనివాసపురానికి చెందిన మజ్దూర్‌ రాజశేఖర్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. మొత్తం 100 గ్రాముల బంగారు ఆభణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

● లక్కిరెడ్లిపల్లె మండలం దిన్నెపాడు గ్రామం బెస్తపల్లె హరిజనవాడకు చెందిన మద్దిరేవుల కదిరమ్మ ఇంట్లో చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెందిన దిన్నెపాటి ఓబలేసును అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని పర్వతరెడ్డిగారిపల్లె బస్టాప్‌ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని నుంచి చోరీలో దోచుకెళ్లిన రూ.30 వేలు, 20.20 గ్రాముల బంగారు సరుడు, రెండు బంగారు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె సీఐ, లక్కిరెడ్డిపల్లె, రామపురం మండలం ఎస్‌ఐలు పాల్గొన్నారు.

చోరుడు.. టీడీపీ నాయకుడు..

లక్కిరెడ్డిపల్లె దిన్నపాడులో దొంగతనం చేస్తూ పట్టుబడిన దిన్నెపాటి ఓబులేసు తెలుగుదేశం పార్టీ దిన్నెపాడు గ్రామ అధ్యక్షుడిగా ఉండడం గమనార్హం. అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ చోరీలకు పాల్పడుతుండడమేగాక.. పోలీసులపై అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

పంటల ప్రణాళిక ముఖ్యం

సంబేపల్లె : ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయంలో పంటల ప్రణాలిక సిద్ధం చేసుకోవాలని అన్నమయ్య జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వెంకటమోహన్‌ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని ప్రకాష్‌నగర్‌ కాలనీ గ్రామంలో క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలు, వర్షభావం దృష్టిలో ఉంచుకొని పశుగ్రాసం కొరత లేకుండా ముందస్తు పంటల ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో విత్తన గుళికల తయారీ ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోవచ్చని వివరించారు.

లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలలో చోరీ

వివరాలు వెల్లడించిన డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement