● కష్టార్జితానికి గుర్తింపు..
నందలూరుకు చెందిన మండిపల్లి శ్రీషిత ఎంఎస్సీ (కెమిస్ట్రీ)లో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా మూడు బంగారు పతకాలను కై వసం చేసుకుంది. ఎంఎస్సీ కెమిస్ట్రీలో టాపర్‌గా నిలవడంతో పాటు, పీజీ కోర్సుల్లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచినందుకు, కెమిస్ట్రీ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు గాను ఈ పతకాలు లభించాయి. తండ్రి వేణుమాదవ్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ కుమార్తెను చదివించగా, తల్లి పరిమళ గృహిణి. ‘నాన్న కష్టానికి తగ్గ ఫలితం దక్కింది.
● వాచ్‌మెన్ కుమార్తెకు స్వర్ణ పతకం
ప్రొద్దుటూరుకు చెందిన లాజర్,దేవిరాణిల కుమార్తె సువర్ణ ఎంఏ (హిస్టరీ అండ్ ఆర్కియాలజీ)లో బంగారు పతకం పొందింది. లాజర్ నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కూతురిని చదివించారు.‘సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్వర్ణ పతకం సాధించడం గర్వంగా ఉంది‘ అని సువర్ణ పేర్కొన్నారు.
● టైలర్ కుమార్తెకు రెండు స్వర్ణాలు
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ప్రకృద్దీన్, షాకీరాల కుమార్తె తస్లీమా ఎంఏ జర్నలిజంలో రెండు బంగారు పతకాలను సాధించింది. తండ్రి టైలర్‌గా పనిచేస్తూ కుమార్తెను ఉన్నత చదువులు చదివించగా, తండ్రి కష్టాన్ని గుర్తించిన తస్లీమా శ్రమించి చదివి ఈ ఘనత సాధించింది. పతకాలు సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
● టిఫిన్ సెంటర్ నిర్వాకుడి కుమారుడు ప్రతిభ
గుంటూరుకు చెందిన శివలింగం నాయక్, ఏసు జమ్మల కుమారుడు పవన్‌కుమార్ నాయక్ ఎంఏ ఎకనామిక్స్‌లో అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. తండ్రి శివలింగం నాయక్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ కుమారుడిని చదివించారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా పవన్ రాణించి పతకాన్ని సాధించాడు.


