గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బటన్ నొక్కిన వెంటనే గంటల్లోపు రైతు భరోసా పథకం కింద నిధులు జమ అయ్యేవి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇంకా డబ్బులు జమ కాకపోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. రైతు సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే ఒక్క ఇరవై రోజులు ముందు ఏర్పాటు చేసి ఉంటే ప్రతిరైతుకు మేలు జరిగి ఉండేది. – నారాయణ రెడ్డి,
వెలవలి గ్రామం, రాజుపాళెం మండలం, వైఎస్సార్ కడప జిల్లా


