నేడు భారీ ర్యాలీ
రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలో శుక్రవారం ఉదయం ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాయచోటి జిల్లా కేంద్రం తరలింపునకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రాయచోటి జమియా మస్జీద్ ప్రభుత్వ సర్కాజీ షర్ఫుద్దీన్ తెలిపారు. స్థానికంగా గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేదా రాయచోటిని కడపలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నమాజ్ తరువాత ఠానా సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి కుల,మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలసి రావాలని కోరారు. సమావేశంలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు.


