పెళ్లయితే ఇంటి పేరు మార్చుకోవాలా? | - | Sakshi
Sakshi News home page

పెళ్లయితే ఇంటి పేరు మార్చుకోవాలా?

Jan 2 2026 11:18 AM | Updated on Jan 2 2026 11:18 AM

పెళ్లయితే ఇంటి పేరు మార్చుకోవాలా?

పెళ్లయితే ఇంటి పేరు మార్చుకోవాలా?

వివాహ రిజిస్ట్రేషన్‌పై

అవగాహన అవసరం

పేరు మార్పుతో అనేక చిక్కులకు చెక్‌

కడప సిటీ : భారతీయ సీ్త్ర పెళ్‌లై అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆమె జీవితంలో ఎన్నోమార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యక్తులతో కలిసి నూతన జీవితం ప్రారంభించే మహిళ పేరులోనూ మార్పులు వచ్చి చేరుతాయి. నిజానికి పెళ్‌లైన తర్వాత తన ఇంటి పేరును మార్చి భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా? చట్టాలు ఏం చెబుతున్నాయి?

ఆడపిల్లగా...

అమ్మాయి పెళ్లాయ్యాక అత్తారింటికి వెళ్లి అక్కడ ఉండే పిల్లగా మారిపోతుంది. అందువల్ల మనం ‘ఆడ’ పిల్ల అనడం సహజం. పెళ్‌లైయిన తర్వాత భర్తతో కలిసి ముందుకు సాగుతుంది. వారి కుటుంబంలో ఒకరిగా భాగమై పోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. ఈ సమాజంలో సంప్రదాయంగా ఇది అనాదిగా వస్తున్నదే. కానీ చట్టప్రకారం పెళ్‌లైన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం ఇది పూర్తిగా వారి ప్రాథమిక హక్కులోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగడమన్నది వారి ఇష్టం. అయితే పేరు మార్చుకునే విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి.

వివాహిత తనకు పెళ్లికాకముందు ఉన్న ఇంటి పేరునే (మెయిడెన్‌ నేమ్‌) కొనసాగించవచ్చు. పెళ్‌లైన తర్వాత తన ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం రెండవది. మన దేశంలో అఽధికశాతం మంది అనుసరించే విధానం ఇదే. పెళ్లి కాకముందే ఉన్న ఇంటి పేరు మార్చుకోకుండానే పేరు చివరలో భర్త పేరును చేర్చుకోవడం మరో విధానం.

ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?

పేరు మార్చుకోవడం వల్ల అన్నింటి కంటే ముఖ్య ప్రయోజనం చట్టపరంగా గుర్తింపు సమస్యలు ఎదురు కావు. అత్తారింటిని గౌరవించినట్లవుతుంది. ఆ కుటుంబం తనదిగా భావించినట్లు భర్త తరుపు వారిలో సానుకూలత పెరుగుతుంది. కాకపోతే పేరు మార్పునకు కొంత శ్రమించాల్సి వస్తుంది. తన తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం ఆ కుటుంబంలో భాగమైన తన పేరు మారిపోతుందనే మానసిక సంఘర్షణ ఎదురవుతుంది. వీటిని మరిచిపోగలిగితే పేరు మార్చుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలతో ఆనందంగా ఉండడం సాధ్యమే.

పెళ్లి కాకముందు..

పెళ్లికాకముందున్న పేరుతో పెళ్లయిన సీ్త్ర కొనసాగితే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తప్పక ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ పరమైన వివాదాలు తలెత్తితే ఇలాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు ఆ మహిళ గుర్తింపునకు సంబంధించిన సవాలక్ష ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ఊహించని ఆస్తి, ఇతరత్రా వివాదాలు తలెత్తినా సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పెళ్లయిన మహిళ తన ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ పేరు మార్చుకున్నట్లయితే ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లలోనూ ఈ మేరకు మార్పులు చేసుకోవాలి. రెండు, మూడు ఆప్షన్లలో ఆ మేరకు కీలక డాక్యుమెంట్లతో పేర్లను మార్చుకోవాలి. ఈ విధానం ద్వారా ఆర్థిక, ఆస్తి లావాదేవీ విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు.

ఎక్కడెక్కడ మార్చుకోవాలి..

ముందుగా వివాహాన్ని రిజిష్టర్‌ చేయించుకోవాలి. చట్టప్రకారం మన దేశంలో ప్రతి వివాహాన్ని తప్పకుండా రిజిష్టర్‌ చేయించుకోవాలి. కంపల్సరీ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ మ్యారెజెస్‌ యాక్టు–2005 ఇలా నిర్దేశిస్తోంది. కానీ ఈ చట్టం పటిష్టంగా అమలు కావడం లేదు. వివాహాన్ని రిజిష్టర్‌ చేసుకున్న తర్వాత రిజిష్టర్‌ కార్యాలయం ఓ ధృవీకరణ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. ఇది చాలా కీలకమైంది. పెళ్లయిన తర్వాత ఏ పేరుతో కొనసాగుతారో అదే పేరును కూడా రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌లో ఉండేలా చూసుకోవాలి. ఇదే సర్టిఫికెట్‌ అన్నింటికి ఆధారంగా పనికి వస్తుంది. ఒకవేళ గుర్తింపు, వారసత్వ హక్కుల విషయంలో సమస్యలు తలెత్తితే ఈ సర్టిఫికెట్‌ కీలకంగా మారుతుంది. పైగా ఇతర అన్నిచోట్ల పేర్ల మార్పునకు కీలక ఆధారంగా పనిచేస్తుంది.

వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌ కార్యాలయంలో పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక పత్రికలో గెజిట్‌ కార్యాలయం ప్రకటన ఇచ్చిన తర్వాత పేరు మారుతుంది. లేదంటే భర్తతో కలిసి సంయుక్తంగా అఫిడవిట్‌ తీసుకుంటే సరిపోతుంది.

వీటిల్లోనూ మార్చుకోవాలి

భర్త ఇంటి పేరును స్వీకరిస్తే ఆధార్‌కార్డు, ఓటరు కార్డు, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు వంటి వాటిల్లో కూడా ఈ మేరకు పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు ఖాతాల్లోనూ పేరు మార్పు చేసుకోవాలి. ఎందుకంటే అన్ని లావాదేవీలకు కీలకంగా బ్యాంకు ఖాతా ఉంటుంది. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌, డీమ్యాట్‌ ఖాతాల్లోనూ మార్పులు చేసుకోవాలి. వీటిలో పేర్లు మార్పు కోసం అఫిడవిట్‌ జిరాక్స్‌ కాపీ లేదా వివాహ నమోదు పత్రం కాపీలను ఇవ్వాలి ఉంటుంది. అప్పటికీ పాత పేరుతోనే బీమా పాలసీ కలిగి ఉంటే బీమా కంపెనీలకు పేరుమార్పు గురించి తెలియజేయాలి. అలాగే డ్రైవింగ్‌లైసెన్స్‌ ఉంటే ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా ఇతరత్రా ఎక్కడెక్కడ పేరు మార్చుకోవాలన్నది మీకున్న వ్యవహారాలనుబట్టి తెలిసిపోతుంది. ఉద్యోగం చేస్తుంటే కార్యాలయ రికార్డుల్లోనూ మార్పులు తప్పనిసరి. మహిళను ఇంటి పేరుతో పిలువడం సర్వసాధారణం. అంతేకాదు...ఎక్కడైనా పేరు రాయాల్సి వచ్చినప్పుడు పూర్తి పేరు అడగకుండానే సర్‌ నేమ్‌గా భర్త తరుపు పేరును చేరుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement