గంగమ్మ జాతర వేలం పాటలో రూ. 28,49,000 ఆదాయం
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గ్రామంలో వెలిసినగంగమ్మ ఆలయంలో శనివారం దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా రూ. 28 లక్షల 49 వేలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 17, 18,19 తేదీల్లో జరగనున్న జాతరకు సంబంధించి వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా టెంకాయలు, పూజా సామగ్రి కోసం నిర్వహించిన వేలంపాటలో రూ. 7 లక్షలు, జాతన తలనీలాలకు రూ. 1 లక్ష, 90 వేలు, విడిదినాల్లో తలనీలాలకు రూ. 6 లక్షల, 55 వేలు, విడిదినాల్లో కొబ్బరికాయలు రూ. 7 లక్షల, 92 వేలు, షామియాన సప్లయర్స్ కోసం రూ. 5 లక్షల, 12 వేల ఆదాయం వచ్చిందని వారు తెలియజేశారు. టోల్‌గేట్, ఐస్‌క్రీమ్‌లు అమ్ముకొనేందుకు సంబంధించిన వేలంపాట వాయిదా పడిందని చెప్పారు. వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాకు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.


