31న పింఛన్ల పంపిణీ
రాయచోటి : పింఛన్ల పంపిణీ డిసెంబర్ 31వ తేదీన చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పింఛన్‌దారులు డిసెంబర్ 31వ తేదీన అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరికీ వారి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
మిట్స్ ఒప్పందం
కురబలకోట : చైన్నెకు చెందిన హ్యాకర్స్ ఇన్పోటెక్ సంస్థతో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ రామనాధన్ శనివారం తెలిపారు. విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ఎరువుల దుకాణాల తనిఖీ
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏఓ) శివనారాయణ శనివారం అకస్మిక తనిఖీ చేశారు. యూరియా నిల్వలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్‌పీ ధరలకే యూరియా అమ్మాలని సూచించారు. అలా కాకుండా ఎఫ్‌సీవో యాక్టును అతిక్రమించి అధిక ధరలకు అమ్మితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు
శాస్త్రోక్తంగా
స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణ మూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
31న పింఛన్ల పంపిణీ
31న పింఛన్ల పంపిణీ


