సన్మార్గానికి దిక్సూచి భగవద్గీత
రాజంపేట టౌన్: భగవద్గీత సన్మార్గానికి దిక్సూచి అని శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ గీతా జయంతిని పురస్కరించుకొని రాజంపేట పట్టణంలోని మన్నూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా స్థాయిలో భగవద్గీత శ్లోకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలు తిరుమల–తిరుపతి దేవస్థానాల హిందూ ధర్మప్రచార పరిషత్తు జిల్లా ప్రోగ్రాం అసిస్టెంట్ డాక్టర్ టి.గోపిబాబు, ధర్మాచార్యులు గంగనపల్లె వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి రమేష్‌నాయుడు, వీహెచ్‌పీ రాష్ట్ర ప్రాంత కార్యదర్శి కాకర్ల రాముడు చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం శారద, వీహెచ్‌పీ రాష్ట్ర నాయ కులు కాకర్ల రాముడు, భగవాన్ గీతాసేవా సత్సంగ ప్రముఖులు తుంగా వెంకటరమణారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, చీనేపల్లె చెంగయ్య, అరవ రమణయ్య, సునీత, రవీంద్రనాయుడు పాల్గొన్నారు.
విజేతలు వీరే: భగవద్గీత 14వ అధ్యాయంలో పురం వన్యశ్రీ, ఎ.కుశాల్, ఎస్.ఉజ్వల వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుపొందారు. 16వ అధ్యాయంలో పి.రేణుశ్రీ, శివపార్వతి, విక్రమ్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ వరుస బహుమతులను కై వసం చేసుకున్నారు. నిత్యజీవితంలో భగవద్గీత–భావ విశ్లేషణ అనే అంశంపై పి.శ్రీనివాసులు, వీరేంద్ర, తేజ, వెంకట శివలు ప్రథమ, ద్వితీయ, తృతీయ వరుస బహుమతులను గెలుపొందారు. హర్షిణి, మహాశ్రీ, ఈక్షితలు ప్రోత్సాహ బహుమతులను కై వసం చేసుకున్నారు. కాగా ఈపోటీలకు న్యాయ నిర్ణేతలుగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటసుబ్బారెడ్డి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి, బొట్టా రామచంద్రయ్యనాయుడు, యూపి.రాయుడు, స్రవంతి, మునికుమార్, శ్రీనివాసులు, గోపాలకృష్ణలు వ్యవహరించారు.


