సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి
రాయచోటి టౌన్: విద్యార్థులలో సైన్స్ పట్ల మక్కువ పెంచుకొనే విధంగా చూడాలని చెకుముకీ సైన్స్ సంబరాల జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా ఫకృద్దీన్ తెలిపారు. రాయచోటి డైట్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ముగింపు సమావేశాలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైన్స్ జ్ఞానాన్ని బోధిస్తుందని తెలిపారు. అందుకే విద్యార్థులకు సైన్స్ పట్ల మక్కువ పెంచుకొనే విధంగా బోధించాలని సూచించారు. డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ 30 మండలాల నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొని, చెకుముకు పోటీలు విజయవంతం చేశారని చెప్పారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో శాసీ్త్రయ దృక్పథ పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మూఢనమ్మకాలను పారదోలి జ్ఞానాన్ని బోధిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సహదేవరెడ్డి, సదుపాయాల కల్పన దాత ప్రసాద్ నాయుడు, వైసి రెడ్డెప్పరెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ నాయకులు హరినాథరెడ్డి, అకాడమిక్ మానటిరింగ్ ఆఫీసర్ అసదుల్లా బాష, జిల్లా సైన్స్ ఆఫీసర్ ఓబుల్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు రవీంద్రనాథరెడ్డి ప్రతాప్‌రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


