30 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి
బి.కొత్తకోట: 12వ వేతన సవరణ అమలు ఆలస్యం అవుతున్న కారణంగా 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని మాజీ శాసన మండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బి.కొత్తకోట మంలం హార్సిలీహిల్స్‌లో జరిగిన ఎస్టీయూ రామసముద్రం మండల కౌన్సిల్, మండల 30 వసంతాల మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అయన మాట్లాడారు. 2023 జూలై నుంచి 12 పీఆర్సి అమలు కావాల్సి ఉండగా ఆలస్యమైనందున ప్రస్తుత ప్రభుత్వం 12వ పీఆర్సి కమిటీ చైర్మన్ నియమించాలని డిమాండ్ చేశారు. 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు మధ్యంతర భృతి కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ జీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 9వ తేది చలో పార్లమెంట్‌లో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంకం శివారెడ్డి, పోకల మధుసూదన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల మురళి, కార్యదర్శి రాజారెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయూబ్, రమాదేవి, ఎస్టీయూ నాయకులు సురేష్, వేణుగోపాల్‌రెడ్డి, నరసింహులు, భాస్కర్ రెడ్డి, జనార్దనరెడ్డి, నరసింహులు సుబ్బారెడ్డి, మహమ్మద్ ఖాన్, అనిల్ కుమార్, సురేష్, ప్రకాష్ రెడ్డి, చంగల్రాయచారి, శంకర, ప్రసాద్, జగన్, కేశవ కుమార్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌సీ కమిటీ చైర్మన్ నియమించాలి
మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి


