నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 24వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహార్ లాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఈవో డివి రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం వీరిని దుశ్శాలుతో సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ విశిష్టతను, స్థల పురాణాన్ని వివరించి చెప్పారు.
కేవీపల్లె: ఈ నెలాఖరులో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి టీ–20 క్రికెట్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు టి20 క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. అద్వైత్ తెలిపారు. ఆదివారం మండలంలోని గ్యారంపల్లె ఏపీ గురుకుల పాఠశాల మైదానంలో అండర్ 17 విభాగంలో జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారిలో వై. రోహిత్‌రెడ్డి, ఎన్. రాహుల్, కె. సాయిప్రకాష్, జి. హేమంత్‌కుమార్, బి. నితీష్, మనోజ్, విష్ణువర్ధన్, కె. విన్సన్, మధు, జయంత్‌నాయక్ రిజ్వాన్, శ్రీనివాసులు, భానుప్రకాష్, లోకేష్ ఉన్నారు.
పెనగలూరు: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26వ తేదీన అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి పెనగలూరు మోడల్ స్కూల్ నుంచి ఎస్ నూర్ ఆయేషా ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సహజబ్లెస్సీ తెలిపారు. మాక్ అసెంబ్లీలో ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.జిల్లా నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపిక కాగా అందులో తమ పాఠశాల నుంచి ఒక విద్యార్థి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.నూర్ ఆయేషాకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.
కురబలకోట: అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో డిసెంబరు 8 నుండి పదో తేదీ వరకు టెక్నాలజీస్, సిస్టమ్స్ నెట్ వర్క్ ఎవల్యూషన్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు వీసీ యువరాజ్ తెలిపారు. ఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ 5000 యూస్ డాలర్స్ (రూ.4,48,120) ఫండ్‌ను నిధుల రూపంలో మంజూరు చేసినట్లు చెప్పారు. చాన్స్‌లర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్‌లర్ ఎన్. ద్వారకనాధ్, డాక్టర్ ప్రదీప్‌కుమార్, డాక్టర్ జి. నాగశ్వేత తదితరులు పాల్గొన్నారు.
కడప అర్బన్/వల్లూరు: కడప నగర శివారులోని వాటర్ గండి పెన్నా నది ప్రవాహంలో ఆదివారం ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఆదివారం రాత్రి వరకు లభ్యం కాలేదు. చెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వున్న వాటర్‌గండి పెన్నానదిలో ఈత కొట్టేందుకు కడప నగరం రామాంజనేయపురానికి చెందిన నరేష్(16), అశోక్‌నగర్‌కు చెందిన రోహిత్‌బాబు(16)తోపాటు మరో ముగ్గురు కలిసి వెళ్లారు. సరదాగా ఈతకొట్టారు. అదే సమయంలో సెల్‌ఫోన్‌లతో ‘రీల్స్’ కూడా చేసుకున్నారు. నరేష్, రోహిత్‌బాబుతోపాటు అరుణ్ అనే విద్యార్థి కూడా గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే ఉన్నట్లుండి అరుణ్‌ను దేవాలయం సమీపంలో వాచ్‌మెన్‌గా వున్న ఆంజినేయులు రక్షించాడు. నరేష్, రోహిత్‌బాబు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక


