తంబళ్లపల్లె : చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఇరువూరు గ్రామానికి చెందిన గడ్డం కాసిరెడ్డి (27), కడప జిల్లా సీకె దిన్నె మండలం గురుగుపూడు తండాకు చెందిన బుక్కే సతీష్‌నాయక్ (25)లు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడే వారు. వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కడప కోటిరెడ్డిసర్కిల్ : పదిహేడు నెలల వయసు గల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్టాండు వద్ద వదిలిపెట్టి వెళ్లారన్న సమాచారాన్ని చిన్నచౌకులోని కారుణ్య ఫౌండేషన్ ప్రతినిధులకు తెలియజేయడంతో.. వారు వెళ్లి ఆ చిన్నారిని తీసుకుని కారుణ్య వృద్ధాశ్రమంలో అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మిషన్ వాత్సల్య పథకం, జిల్లా సీ్త్ర శిశు అభివృద్ధి సంస్థ, కడప వారు కారుణ్య వృద్ధాశ్రమం వద్దకు వెళ్లి ఆరేళ్ల వయసు లోపు గల పిల్లలను బాలల న్యాయ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ లేని స్వచ్ఛంద సంస్థల్లో ఉంచకూడదని తెలియజేసి ఆ చిన్నారిని కడప సీడబ్ల్యూసీ వద్ద హాజరు పరిచారు. ఈనెల 19వ తేదీన సీడబ్ల్యూసీ కడప వారు ఆ చిన్నారిని శిశుగృహ సంరక్షణలో ఉంచాలని ఆదేశించారు. ఈ చిన్నారి తల్లిదండ్రులు గానీ, రక్త సంబంధీకులు గానీ ఉన్నట్లయితే వారు తగిన రుజువులతో బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ)కడప వారిని సంప్రదించాలని వారు కోరారు.
పెనగలూరు : సమగ్ర శిక్షలో అన్ని కేటగిరీలలో పని చేస్తున్న సిబ్బందికి హెచ్‌ఆర్‌ఏ అమలు చేయాలని శుక్రవారం ఎంఆర్‌సీ కార్యాలయంలో సమగ్ర శిక్ష సిబ్బంది ఎంఈఓలు గిరి వరదయ్య, సుబ్బరాయుడులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష కేటగిరిలో పనిచేస్తున్న అందరికీ హెచ్‌ఆర్‌తోపాటు మినిమం టైమ్ స్కేలు అమలుపరచాలని, అలాగే ఈపీఎఫ్ ఈఎస్‌ఐ గ్రాట్యుటీ హెల్త్ మెడికల్ లీవులు వెంటనే మంజూరు చేయాలన్నారు. అలాగే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పొడిగించాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకుంటే ఈనెల 24వ తేదీ జిల్లా కార్యాలయాల్లో, డిసెంబర్ 10వ తేదీన ఎస్పీడీ కార్యాలయాల వద్ద శాంతియుతంగా ధర్నాలు చేపట్టడం జరుగుతుందని వారన్నారు. కార్యక్రమంలో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్ కె.విజయకుమార్, కంప్యూటర్ ఆపరేటర్ రాజేశ్వరి, అకౌంటెంట్ శివరామరాజు, సీఆర్‌ఎంటీలు సుజాతమ్మ, శశికళ, నరసింహులు, బాదుషా, మెసెంజర్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్


