ఫుట్‌బాల్ విజేతలు విశాఖ, అనంతపురం జట్లు
ట్రోఫీ అందుకుంటున్న విశాఖపట్నం బాలుర జట్టు
విజేత బాలికల జట్టు అనంతపురం
మదనపల్లె సిటీ : ఎస్‌జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ అండర్–14 బాల,బాలికల పోటీల్లో ఫైనల్స్‌లో బాలుర జట్టులో విశాఖపట్నం, బాలికల జట్టులో అనంతపురం జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. స్థానిక చిత్తూరు రోడ్డులోని గ్రీన్‌వ్యాలీ స్కూల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో శుక్రవారం ఫైనల్స్ జరిగాయి. బాలుర విభాగంలో ఫైనల్స్‌లో విశాఖపట్నం–చిత్తూరు జిల్లా జట్లు పోటీ పడ్డాయి. విశాఖపట్నం 2–0 స్కోరుతో చిత్తూరు జిల్లా జట్టుపై విజయం సాధించింది. బాలికల ఫైనల్స్‌లో అనంతపురం– కడప జిల్లా జట్లు పోటీపడగా.. అనంతపురం జిల్లా జట్టు 2–0 స్కోరుతో కడప జట్టుపై గెలుపొందింది. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా హాజరై విజేతలకు ట్రోఫీ, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శులు బాబు, నాగరాజు, ఝాన్సీ, ఆడ్మిన్ కార్యదర్శి శారద, ఆర్గనైజింగ్ కార్యదర్శి మురళీధర్, అబ్జర్వర్ పాల్ పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి అండర్–14 బాలికల జట్టు
లోహిత చందన, విష్ణు ప్రణవి, షర్మిల, అమృత (అనంతపురం), గానవి, నిఖిల, మోక్షరెడ్డి, (చిత్తూరు), మైథిలి, శ్రీలత, ఈశ్వరమ్మ(కడప), నైమా, రిషిత(పశ్చిమగోదావరి), మహిఫిర్దోస్(నెల్లూరు), అశ్విని(తూర్పు గోదావరి), నికితరెడ్డి (కర్నూలు), లాస్య(విశాఖపట్నం), రోహిణి (శ్రీకాకుళం), వర్షితరెడ్డి(కడప)
స్టాండ్‌బైలుగా : జ్ఞానపరమేశ్వరి(విజయనగరం), లోకేశ్వరి(అనంతపురం), దుర్గా(గుంటూరు), అవంతి(కడప), తనుశ్రీ(అనంతపురం), అమీమా(చిత్తూరు) ఎంపికయ్యారు.
ఫుట్‌బాల్ విజేతలు విశాఖ, అనంతపురం జట్లు


